ఏపీ ఫైబర్ నెట్‍లో 500 మంది ఉద్యోగుల తొలగింపు
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‍లో ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‍లో ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకే సారి ఫైబర్ నెట్ లో పనిచేస్తున్న ఐదు వందల మందిని తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సూర్య ఎంటర్ ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరికి ఈ నెలఖారు వరకు గడువు విధించింది. తర్వాత వారి సేవలను నిలుపదల చేయాలని నిర్ణయించింది.
గత ప్రభుత్వ హయాంలో...
గత ప్రభుత్వంలో నియమితులైన ఐదు వందల మంది ఉద్యోగులు తొలగించడానికి అంతా సిద్ధమయింది. ఈ నెలాఖరు తర్వాత వారి సేవలను పొడిగించే అవకాశముండదని, ఒక ఉద్యోగాల నుంచి వెళ్లిపోవాలని సంస్థ యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపిస్తూ దానికి ఛైర్మన్ గా ఉన్న జీవీరెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది