Chandrababu : నేడు సింగపూర్ కు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు నాయుడు తన మంత్రులతో కలసి సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మొత్తం ఆరు రోజుల పాటు సింగపూర్ రాష్ట్రంలో పర్యటించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో పెట్టుబడులను...
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగనుంది. సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ లోపెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించేందుకు ఆయన బయలుదేరి వెళుతున్నారు. దీంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణంలోనూ భాగస్వామ్యులు కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు నారాయణ, నారా లోకేశ్, టీజీ భరత్ లతో పాటు మరికొందరు అధికారులు కూడా సింగపూర్ బయలుదేరి వెళ్లే బృందంలో ఉన్నారు.