Andhra Pradesh : కొత్త ఏడాది ఏపీ ప్రజలకు ప్రభుత్వం బహుమతి ఇదే

నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2026-01-01 12:28 GMT

నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రకాల భూములు 22ఏ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు నూతన సంవత్సరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు తెలిపారు.

22 ఏ జాబితా నుంచి...
ప్రైవేట్‌ భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ప్రైవేట్‌ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు దానిని సుమోటోగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా 22ఏ నుంచి తొలగించాలని ఆదేశించారు. రైతులు, భూ యాజమానుల హక్కులను రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి అన్నారు.


Tags:    

Similar News