వీసీ అప్పారావు రాజీనామా చెయ్యాలి !

Update: 2016-03-29 14:22 GMT

విద్యార్థులతో సఖ్యతతో మెలగాల్సిన హైదరాబాద్ సెం ట్రల్ యూనివర్శిటీ వీసీ అప్పారావు వారి పట్ల వివక్ష చూపారని కేంద్రమాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే విమర్శించారు. అప్పారావు ఇప్పటికైనా రాజీనామా చేయా లిని, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆయనను వీసీ పదవినుంచి తొలగించాలని డిమాం డ్ చేశారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన షిండే.. రోహిత్ తల్లి రాధికను పరామర్శించారు. ఈ సందర్బంగా విద్యా ర్థులు హెచ్‌సీయూలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని, రోహిత్‌ది ఆత్మహత్య కాదు, సంస్థాగత హత్య అని వారు షిండే దృష్టికి తీసుకవచ్చారు. షిండేతో కలిసి దళిత, యువజన సంఘాల నేతలు ఈసందర్బంగా భేటీ అయ్యారు. అనంతరం షిండే మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్య జరిగిన రోజునే అప్పారావు తన పదవినుంచి తప్పుకోవాల్సిందన్నారు. ఆయనపై అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళితులను కేంద్రం అణచివేయాలని చూస్తోందన్నారు. విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షిండ ేతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మహారాష్ట్ర ఎంపీ రాజీవ్ సతావ్ పాల్గొన్నారు.కాగా...కాంగ్రెస్ నేతల బృందం నేడు డిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ఈ ప్రతినిధి బృందం సమావేశం కానుంది. హెచ్‌సీయూలో లాఠీచార్జ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Similar News