రజనీకాంత్, పవన్ ఓకే చెబితే

Update: 2017-06-30 02:18 GMT

దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ సిద్ధమైంది. ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ తో వారు చర్చలు జరుపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రజాగాయకుడు గద్దర్ ఈ సంధర్భంగా చెప్పారు. పవన్, రజనీలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు గద్దర్ తెలిపారు. వారి అంగీకారం కోసమే ఎదురుచూస్తున్నామని, 200 పార్లమెంటు స్థానాల్లో తమ వేదిక ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు గద్దర్ వెల్లడించారు.

Similar News