యువకుడి ప్రాణం తీసిన నాలా

Update: 2017-10-15 02:28 GMT

భారీ వర్షాలతో హైదరాబాద్‌లో నాలాలు , డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి . జీడిమెట్లలో నాలాకు వరద ఉధృతి పెరిగింది. నాలాను దాటే సమయంలో స్థానికులు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు ప్రాణాలకు తెగించి వారిని రక్షించే యత్నం చేశాడు. అయితే నాలా వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో.. అదుపుతప్పి యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే... యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలా వరదలో బాలా నగర్ వరకూ కొట్టుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ప్రమాదకరంగా....

గత కొంతకాలంగా జీడిమెట్ల నాలా ప్రమాదకరంగా తయారైందని జీహెచ్ఎంసీ అధికారులకు స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాలు, డ్రైన్లు పొంగిపొర్లుతుండటంతో.. నాలాల పరిస్ధితి ప్రమాదకరంగా తయారైంది. జీడిమెట్ల నాలా వరద స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తోంది.యువకుడి గల్లంతుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు స్థానికులు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అదికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

Similar News