మోసగాడు మాల్యాకు బెయిల్ మంజూరు

Update: 2017-04-18 11:54 GMT

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ను లండన్ లో స్కాట్ లాండ్ యార్డు పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ మాల్యాను వెస్ట్ మినిస్టర్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. అయితే మూడు గంటల్లోనే మాల్యాకు షరతులతో కూడిని బెయిల్ మంజూరయింది. మాల్యా 17 బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసిన కేసుల్లో నిందితుడు. అయితే మాల్యాను అరెస్ట్ చేయడంతో ఒప్పందం ప్రకారం భారత్ కు అప్పగిస్తారని అందరూ భావించారు. అయితే లండన్ కోర్టు మాత్రం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. గత ఏడాది మార్చి 2వ తేదీన లండన్ వెళ్లిన విజయ్ మాల్యా అక్కడే ఉంటున్నారు. బెయిల్ మంజూరు తర్వాత మాల్యా ట్విట్టర్లో స్పందించారు. తన అరెస్ట్ పెద్ద విషయమేమీ కాదన్నారు. ఇండియన్ మీడియా సహజంగానే దీనిని పెద్దది చేసి చూపిస్తుందని ట్వీట్ చేశారు.

Similar News