మరో అభ్యర్థిని ప్రకటించిన జగన్

Update: 2018-01-11 08:31 GMT

కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ ను వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్లు ఆ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. కర్నూలు నియోజకవర్గంలో పార్టీలో ఉన్న సందిగ్దతను తెరదించాలన్న లక్ష్యంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. నియోజకవర్గ సమావేశంలో గౌతంరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో హఫీజ్ ఖాన్ వర్గంలో ఆనంద పెల్లుబుకుతోంది. ఇప్పటికే జగన్ పత్తికొండ నియోజకవర్గంలో శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News