మన ఎంపీల దెబ్బకు ఉభయ సభలూ వాయిదా

Update: 2018-03-05 06:34 GMT

టీడీపీ ఎంపీల నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలూ వాయిదాపడ్డాయి. లోక్ సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీలు విభజన హామీలు అమలు చేయాలంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో లోక్ సభ పన్నెండుగంటలకు స్పీకర్ వాయిదా వేశారు. తర్వాత లోక్ సభ ప్రారంభమైనా అదే పరిస్థితి. దీంతో స్పీకర్ లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి. ప్లకార్డులు పట్టుకుని రాజ్యసభలో నినాదాలు చేయడంతో ఛైర్మన్ వెంకయ్య నాయుడు వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినా వారు నినాదాలను ఆపకపోవడంతో రాజ్యసభ ను రెండు గంటలకు వాయిదా వేశారు. లోక్ సభలో టీడీపీ ఎంపీల ఆందోళనకు టీఆర్ఎస్ కూడా మద్దతు పలకడం విశేషం. జై తెలంగాణ అంటూ వారు నినాదాలు చేశారు.

Similar News