బ్రేకింగ్ : సీఎం కేసీఆర్ కు తప్పిన ప్రమాదం

Update: 2018-02-27 07:33 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రమాదం తప్పింది. కరీంనగర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ లో కి ఎక్కారు. అయితే హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత హెలికాప్టర్ లో ఉన్న ఒక బ్యాగు నుంచి పొగలు వచ్చాయి. వెంటనే ఒక అధికారి ఆ బ్యాగ్ ను దూరంగా తీసుకెళ్లి పడేసి వచ్చారు. అయితే ఆ బ్యాగును పరిశీలించగా అందులో భద్రతా సిబ్బంది వినియోగించే వైర్ లెస్ సెట్ ఉన్నట్లు తేలింది. హెలికాప్టర్ గాల్లో ఉండగా పొగలు వస్తే పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆల్ ఈజ్ వెల్ అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సురక్షితంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

Similar News