ఫెడరల్ ఫ్రంట్ తప్పదు

Update: 2018-03-19 12:15 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో కోల్ కత్తాలో భేటీ అయ్యారు. భేటీ ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తాము థర్డ్ ఫ్రంట్ పై చర్చించామన్నారు. దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉండకూడదని మమత బెనర్జీ కూడా అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికలకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటవుతుందన్నారు. ఈ ఫ్రంట్ ఏక నాయకత్వంలో ఉండదని, బహుముఖ నాయకత్వంలోకొనసాగుతుందని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు కృషి చేస్తామని మమత, కేసీఆర్ లు చెప్పారు. తమతో కలసి వచ్చే పార్టీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామన్నారు. రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్నారు.

Similar News