పుత్తడి బొమ్మ పూర్ణిమ ఎక్కడ?

Update: 2017-06-13 03:04 GMT

గత బుధవారం స్కూల్ కని వెళ్లి కనిపించకుండా పోయిన భాష్యం స్కూల్,నిజామ్పేట్ విద్యార్థి ని ఎక్కడ? ఆమె చదువులు భారమై, చదవడం కన్నా పారిపోవడమే తన ముందున్న మార్గం అని ఎంచుకోవడానికి,అంత మానసిక ఒత్తిడి పాఠశాల వారు ఎందుకు కలిగించారు?అసలు వేసవి సెలవుల సేద దీరకముందే పాఠశాల ఎలా ప్రారంభించారు,ముందుగానే ప్రభుత్వ ఆదేశాలను తోసి రాజని పాఠశాల ప్రారంభించిన వారి పై విద్యా శాఖ చర్యలు చేపట్టారా లేదా మనతో కాని విషయం అని చతికిలబడి కూర్చుందా ? పూర్ణిమ విషయంలో చదువు పేరున పిల్లల ను పాఠశాలలు విపరీతమైన వత్తిడికి గురి చేస్తున్నాయని మరో సారి రుజువైంది,చదువుకన్నా చావే నయం అనే స్థితిలో పిల్లలు వున్నారు,దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?పూర్ణిమ లాంటి గాయపడ్డ హృదయాలకు ఎవరు చికిత్స చేస్తారు,పసిపిల్లల మనసును గాయపరుస్తున్న విద్యా సంస్థల పై చర్యలు తీసుకునే దమ్ము,ధైర్యం ఎవరికైనా వుందా పాఠశాలలు తెరిచే సమయం కన్నా ముందే జరుగుతున్న ఘోరాలను ఎలా చూడాలి,పూర్ణిమ కనిపించకుండా పోతే అందుకు ప్రత్యక్షంగా కారణమైన భాష్యం స్కూల్ వారికి గానీ పరోక్షంగా కారణమైన విద్యా శాఖ కు గానీ చీమకుట్టినట్లైనా ఎందుకు లేదు,పూర్ణిమ ను వెతికి పెట్టడంలో కేవలం పోలీసుల దేనా బాధ్యత?.పూర్ణిమ క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి భాష్యం స్కూల్,విద్యా శాఖ సహితం భాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.

Similar News