పటేల్ కు షాకిచ్చిన ఉద్యోగులు

Update: 2017-01-14 10:30 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు కేంద్రప్రభుత్వ జోక్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగదు నిర్వహణపై కేంద్రప్రభుత్వం అధికారులను నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు లేఖ రాశారు కూడా. నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ దేశవ్యాప్తంగా అప్రతిష్టను మూట గట్టుకుంది. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు...అందుకు సమానస్థాయిలో నగదునుముద్రించాల్సిన ఆర్బీఐ, ప్రజలను ఇబ్బందులను ఎదుర్కొనేలా చేసిందని ఆరోపణలను ఎదుర్కొంది. కేంద్రం చేతిలో పావుగా మారిందని కూడా ఆర్బీఐపై విమర్శలొచ్చాయి.

ఆర్బీఐ అనేది స్వతంత్ర సంస్థ. అటువంటి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ నోట్ల రద్దు తర్వాత ప్రతిష్టను కోల్పోవాల్సి వచ్చిందని ఆర్బీఐ ఉద్యోగులు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆర్బీఐకి ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడానికి కేంద్ర ప్రభుత్వ చర్యలే కారణమని కూడా తెలిపారు. సుమారు 18 వేల మంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ లేఖ రాయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ విషయంలో జోక్యం చేసుకుంటే సహించబోమని కూడా హెచ్చరించారు. పాపం మరి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఏం చేస్తారో మరి.

Similar News