తెలంగాణ జన సమితి ఆవిర్భావం

Update: 2018-04-02 07:31 GMT

తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జనసమితి తమ పార్టీ పేరుగా కోదండరామ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఈ నెల 29వ తేదీన జరగనున్న బహిరంగ సభలో పార్టీ సిద్ధాంతాలను, విధివిధానాలను ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కమిటీలు వేస్తున్నట్లు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల తో ప్రభుత్వం తీరును జనం లోకి తీసుకెళతామని కోదండరామ్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పార్టీ పెట్టినట్లు ఆయన తెలిపారు. తాను రాజకీయాల్లో రావాలని అనుకోలేదని, కొందరి వత్తిడి కారణంగానే పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యమ ఆకాంక్షలకు గౌరవం లేదన్నారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని ఆయన విమర్శించారు. తనకు సహకరించాలని ఆయన కోరారు.

Similar News