తూర్పులో టెన్షన్ ఎందుకు?

Update: 2017-01-21 12:50 GMT

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. కాపు రిజర్వేషన్ల కోసం ఈ నెల 25వ తేదీ నుంచి కాపు సత్యాగ్రహ యాత్రను ముద్రగడ పద్మనాభం తలపెట్టారు. ఏపీలో జరుగుతున్న ఏ కార్యక్రమానికీ పోలీసులు అనుమతి తీసుకోవడం లేదని, తానెందుకు అనుమతి కోరాలని ముద్రగడ అంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ సత్యాగ్రహ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ స్పష్టం చేశారు. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆయన యాత్రకు అనుమతిని నిరాకరిస్తున్నామని చెప్పారు. ఆయన పోలీసుల అనుమతిని కోరితే అప్పుడు పరిశీలిస్తామని ఎస్పీ చెప్పారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ముద్రగడ పద్మనాభం ఈ నెల 25వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో, అహింసాయుతంగా తాను పాదయాత్ర చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇప్పుడు యాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో మళ్లీ తూర్పులో టెన్షన్ మొదలైంది.

Similar News