టెన్త్ లో ఏంటిది నారాయణా...?

Update: 2017-03-28 08:26 GMT

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ప్రశ్నా పత్రం లీకయింది. ఒక అటెండర్ ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ లో పంపిచారని అధికారులు గుర్తించారు. అయితే ఇది నారాయణ విద్యాసంస్థల నుంచే లీకయిందన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. నెల్లూరు, కదిరి, అనంతపురం ప్రాంతాల్లో ప్రశ్నాపత్రం లీకయినట్లు అధికారులు వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం నెల్లూరు జిల్లాలోని ఒక పరీక్ష కేంద్రంలో అటెండర్ తన సెల్ ఫోన్ లో ప్రశ్నాపత్రాన్ని చిత్రీకరించి బయటకు పంపారని చెబుతున్నారు. అయితే దీనిపై విచారణకు ఆదేశించామని, సాయంత్రానికి నివేదిక వస్తుందని గంటా చెబుతున్నారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే పేపర్ లీక్ కాలేదని మంత్రి గంటా చెబుతున్నారు. పేపర్ లీక్ అనేది ఒక దుష్ప్రచారం మాత్రమేనని, ఎగ్జామ్ కంటే ముందు ప్రశ్నాపత్రం బయటకు వస్తేనే అది లీకయినట్లని గంటా వివరణ ఇచ్చారు. ఇక ప్రతిపక్షాలు మాత్రం ఇది నారాయణ విద్యాసంస్థల పనేనని ఆరోపిస్తున్నాయి. ప్రశ్నాపత్రం మంత్రి నారాయణ కు చెందిన విద్యాసంస్థలు లీకయినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెబుతున్నాయి విపక్షాలు.

Similar News