టీడీపీ చేరితేనే బలం అన్న ఉండవల్లి...!

Update: 2018-02-20 06:08 GMT

అవిశ్వాస తీర్మానంలో టీడీపీ వచ్చి చేరితేనే అడ్వాంటేజీ ఎక్కువని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బీజేపీనుంచి అప్పుడు టీడీపీ బయటకు వచ్చే అవకాశముందంటున్నారు. తద్వారా కేంద్రంపై వత్తిడి పెంచేందుకు వీలుంటుందన్నారు. ఏపీ ఎంపీలు మద్దతివ్వకపోయినా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మద్దతిస్తే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగలిగిన బలం ఉంటుందన్నారు ఉండవల్లి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ వస్తే బీజేపీలో కూడా చాలామంది ప్రభుత్వంపై తిరగబడతారని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ తో రాజకీయాల గురించి ఏమీ మాట్లాడలేదన్న ఉండవల్లి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఏమిస్తుందో చూడాలన్నారు. జేఎఫ్ సి నివేదికతోనే అద్భుతం జరుగుతుందని తాను చెప్పలేనన్నారు. అయితే విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. చట్టంలో చేర్చని అంశాలను కూడా అమలు చేశామని చెబుతున్న బీజేపీ, అసలు విషయాలను అమలు చేయకుండా మిగిలినవి చేస్తే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు.

Similar News