జనం సొమ్ముతో కేసీఆర్ జల్సా : ఉత్తమ్

Update: 2017-02-25 14:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ జనం సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కాంగ్రెస్ నేతలను సన్నాసులు అని తిట్టడాన్ని ఆయన ఖండించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మూడేళ్లుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

మొక్కుల పేరిట ప్రజాధనం వృధా....

ఆంధ్రానాయకులకు సూటుకేసులు మోసిన చరిత్ర తమకు లేదన్న ఉత్తమ్ ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్ దోచి పెడుతున్నారన్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రా కాంట్రాక్టర్లకు 30 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల టెండర్లను అప్పగించారని ఉత్తమ్ ఆరోపించారు. సెక్యులర్ దేశంలో మొక్కుల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్న ఉత్తమ్ ప్రత్యేక విమానాల్లో విలాసాలు చేయడం దారుణమని చెప్పారు. కేసీఆర్ ఖర్చు చేసే ప్రతి పైసా తెలంగాణ ప్రజలదేనని గుర్తుంచుకోవాలన్నారు

Similar News