జగన్ కు చంద్రబాబు కౌంటర్ ఇదే...!

Update: 2018-01-27 10:30 GMT

బీజేపీతో పొత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేశారు. బీజేపీ తమతో ఎన్నికలకు వెళ్లాలనుకుంటే...సరే...లేకుంటే ఒక నమస్కారం పెడతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉండాలని చెబుతున్నానని, మిత్రధర్మం కారణంగా ఇంతకు మించి మాట్లాడలేనని చెప్పారు. అంతేకాదు జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు స్పందించారు. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమన్న జగన్ వ్యాఖ్యలను చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం ఎంపీల చేత రాజీనామా చేయిస్తానన్న మాటకు కట్టుబడి ఉండేవారన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జగన్ ప్రత్యేక హోదా విషయాన్ని బీజేపీ ముందు ఎందుకు పెట్టలేదన్నారు. బేషరతుగా మద్దతివ్వడానికి కేసుల నుంచి తప్పించుకోవడానికేనని చంద్రబాబుచెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News