చిన్నమ్మకు కూడా కాళ్లు మొక్కేస్తున్నారు

Update: 2016-12-11 06:19 GMT

తమిళ తంబీలకు కొన్ని శతాబ్దాలుగా అలవాటు అయిపోయిన సంస్కృతి మరోసారి ఫ్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాము మొక్కడానికి ఎవరో ఒకరివి కాళ్ళు కావాలని తమిళసీమలోని రాజకీయ భక్తకోటి మానసికంగా ప్రిపేర్ అయిఉంటారు. అలాంటి వారందరికీ ఇప్పుడు చిన్నమ్మ శశికళ అతిగొప్ప ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నట్లుంది. ఆమెకు పడీ పడీ కాళ్ళు మొక్కేస్తూన్నారు.

జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ వద్ద అమ్మ భక్తులను అనుమతిస్తున్నారు. వచ్చిన వారంతా జయలలిత ఫొటోకు నివాళి అర్పించి పక్కనే ఉన్న శశికళ పాదాలకు భక్తిపూర్వకంగా మొక్కి, ఆమె ఆశీస్సులు పుచ్చుకున్నాకే తీసుకుంటున్నారు.

శశికళ అన్నా డీఎంకే పార్టీ మీద పూర్తి స్థాయిలో పట్టు కోసం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. అది ప్రాసెస్ లో ఉండగానే శశికళ శైలి అమ్మ భక్తకోటి మీద మాత్రం పూర్తి పట్టు సాధించినట్లుంది.

Similar News