చింతమనేనిదే తప్పా?

Update: 2017-06-30 13:06 GMT

ఏపీలో సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఎలాంటి తప్పు చేయలేదని కమిటీ తేల్చి చెప్పింది. వనజాక్షిపై దాడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి సైతం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో విచారణ నీరు గారినట్లేనని అనుమానించారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత తమ్మిలేరు ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతం కృష్ణా జిల్లా పరిధిలోనే ఉందని కమిటీ తేల్చింది. చింతమనేని అనుచరులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడటాన్ని ఎమ్మార్వో అడ్డుకోవడంతోనే దాడి జరిగిందని తేల్చారు. రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్‌ చంద్ర శర్మ., సాల్మన్‌ ఆరోఖ్య రాజ్‌లతో కూడిన బృందం విచారణ జరిపి నివేదికను చీఫ్‌ సెక్రటరీకి సమర్పించారు. వనజాక్షి దెందులూరు ప్రాంతంలోకి వచ్చి తవ్వకాలను అడ్డుకున్నాన్న చింతమనేని వ్యాఖ్యలను కమిటీ తోసిపుచ్చింది. చింతమనేనిపై సిఎం ఎలా స్పందిస్తారో చూడాలి.

Similar News