చంద్రబాబు కల నెరవేరనివ్వబోమంటున్న కామ్రేడ్

Update: 2017-01-20 16:25 GMT

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భీమ్ ఆప్ మరియు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రవేశ పెట్టిన ఎ.పి పర్స్ ఆప్ లు కాష్ లెస్ లావాదేవీలు చేపట్టే ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపకపోగా ప్రైవేట్ సంస్థ పైగా విదేశీయుల పెట్టుబడితో వ్యాపారం జరుగుతున్న పేటిఎం మాత్రం లక్షల కోట్ల టర్న్ ఓవర్ అందుకోవటాన్ని తప్పుపట్టారు ఆంద్ర ప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పి.మధు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్య ప్రజలకి ఏ మాత్రం ఊరట నివ్వకపోగా విదేశీ వ్యాపారస్తులకు భారతగా దేశ మార్కెట్ ని అంగట్లో సరకుల మాదిరిగా విక్రయించటానికి మాత్రమే ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పరమైన సహకారాన్ని భీమ్, ఎ.పి.పర్స్ లకంటే ఎక్కువగా పేటిఎం కు అందించటం పై ఆయన మండి పడ్డారు.

"గత ఏడాది నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు తో నరేంద్ర మోదీ చెప్తున్నట్టు నల్ల కుబేరులు ఏ మాత్రం నష్ట పోలేదు. రెండు నెలల పాటు జీవనోపాధికి కూడా తీవ్ర ఇక్కట్లు పడింది అతి సామాన్యమైన రోజు కూలీలే. ఇప్పటికి పరిస్థితి కొంచం చెక్కబడింది అనుకుంటుంటే నగదు రహిత లావాదేవీలకు విదేశీ పెట్టుబడులకు చేయూత ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ నల్ల ధనాన్ని దేశం దాటించే దిశగా ఆలోచనలు చేస్తుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఊహించని రీతిలో వ్యాపారం విస్తృతం కావటంతో పేటిఎం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ శంఖర్ శర్మ తన ఉద్యోగులకు న్యూయార్క్ లో ఇచ్చిన విందులో పేటిఎం ఎదుగుదలకు ఎవరు అడ్డొచ్చినా యుద్ధ టాంకర్ ల కింద నలిగిపోవటమే అంటూ అహంకారం ప్రదర్శించిన వారితో చంద్ర బాబు నాయుడు భేటీ ఐయ్యి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేటిఎం బ్యాంక్ ని స్థాపించుకునేందుకు ప్రభుత్వ పరంగా సహకరిస్తామంటూ చేసిన వాగ్ధాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిలబెట్టుకోలేరు. గ్రామీణ ప్రజల సొమ్ముని కొల్లగొడుతూ విదేశీయుల వ్యాపారాలకు ధారాదత్తం చేయటం ప్రభుత్వం తన హక్కుగా భావించటం విషాదకరం. పేటిఎం బ్యాంకు స్థాపనకు నిరసన గా పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్దపడతాం తప్ప చంద్ర బాబు కళను నెరవేరనివ్వబోము." అని తేల్చి చెప్పారు పి.మధు.

Similar News