క్యాష్ లెస్...బేస్ లెస్

Update: 2016-12-27 10:30 GMT

ప్రధాని మోదీ చెప్పిన గడువుకు ఇంకా మూడు రోజులే ఉంది. కాని పరిస్థితుల్లో ఏమాత్రం మార్పులేదు. సామాన్యులు ఇంకా కష్టపడుతూనే ఉన్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దుపై రాహుల్ ఇతర పక్షాలతో కలిసి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. క్యాష్ లెస్ అనేది బేస్ లెస్..అని రాహుల్ అన్నారు.

నల్లకుబేరుల మాట ఎలా ఉన్నా సామాన్యులు మాత్రం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారన్నారు. మోదీ చెప్పిన అచ్ఛే దిన్ రాలేదన్నారు. డిసెంబర్ 30 కి అన్నీ చక్కబడతాయని మోడీ చెప్పారు. కాని ఇంకా పరిస్థితులు ఎందుకు చక్కబడలేదని రాహుల్ ప్రశ్నించారు. నగదు మార్పిడికి కొత్త నల్లబజారు తెరమీదకు వచ్చిందన్నారు.పేదలు పడే కష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు రోదిస్తున్నారని..నోట్ల రద్దుతో దేశం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని రాహుల్ అన్నారు. దేశంలో సూపర్ ఎమర్జెన్సీ నెలకొనిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత నోట్ల రద్దు దేశంలో జరిగిన అతి పెద్ద స్కామ్ గా మమత అభివర్ణించారు. 50 రోజుల తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకుంటే మోదీ బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తారా అని మమత ప్రశ్నించారు.

Similar News