కాల్పుల కేసులో కొత్తకోణం

Update: 2017-07-31 13:32 GMT

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులోకొత్త కోణం బయటపడింది. ఆరోజు అర్ధరాత్రి విక్రమ్ గౌడ్ రెండు గంటలకు మిస్ అయ్యారని పోలీసులు గుర్తించారు. రాత్రి రెండుగంటలకు బయటకు వెళ్లిన విక్రమ్ గౌడ్ ఇరవై నిమిషాలు ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఆ 20 నిమిషాలు ఎవరిని కలిసారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. రెండున్నర గంటలకు బయట నుంచి వచ్చిన విక్రమ్ గౌడ్ వాచ్ మెన్ కు బయటగేటు తాళాలు వేయవద్దని చెప్పడం కూడా పోలీసులకు అనుమానం కలుగుతోంది. తుపాకీతో కాల్పులు జరిపితే తనను ఆసుపత్రికి తీసుకెళ్లడం కష్టమని విక్రమ్ గౌడ్ భావించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ గౌడ్ ఇంటి బయటే అపోలో ఆసుపత్రి ఉంది. విక్రమ్ గౌడ్ పై కాల్పులు రెండు నుంచి ఐదు అంగుళాల దూరంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపేందుకు ఎవరు వచ్చారు? అన్నదానిపై నలుగురు అనుమానితుల ఫుట్ ప్రింట్స్ కూడా పోలీసులు సేకరించారు. ఫైర్ జరిగిన తర్వాత విక్రమ్ గౌడ్ ఇంటికి ముందుగా ఎవరు వచ్చారన్న దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు.

Similar News