కర్ణన్‌కు బెయిల్‌ నిరాకరణ

Update: 2017-06-21 07:38 GMT

కోయంబత్తూర్‌లో అరెస్టైన కోల్‌కత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తమిళనాడులో అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో బెయిల్‌ కోసం కర్ణన్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కర్ణన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్‌ ., సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులని వాటిని మార్చడం సాధ్యపడదని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల తర్వాత అదృశ్యమైన కర్ణన్‌ అలాగే పదవి విరమణ చేశారు. కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో ఆయన పరారయ్యారు. జూన్‌ 12న సుప్రీం కోర్టు ఉత్తర్వుల తర్వాత కర్ణన్‌ పరారయ్యారు. ఆ తర్వాత ఆయన క్షమాపణ కోరినా సుప్రీం కోర్టు అంగీకరించలేదు.

Similar News