ఏపీలో కొత్త కొలువుల జాతర

Update: 2017-07-04 01:56 GMT

వివిధ శాఖల్లో 411 పోస్టులు మంజూరు/ కొనసాగింపునకు మంత్రి మండలి ఆమోదం. ఈ పోస్టులకు రూ.15.57 కోట్లు వ్యయ మవు తుంది. ఏపీ డిజాస్టరీ రికవరీ ప్రాజెక్ట్‌లో 10 అదనపు పోస్టులు, 41 పోస్టులు కొనసాగింపు. ఈ పోస్టులు 03.10.2017 నుంచి 30.098.2020 వరకు కొనసాగుతాయి. ప్రపంచబ్యాంకు సహకారంతో రాష్ట్రంలో మార్చి 17 నుంచి ప్రారంభమైన ఏపీ కరవు నిర్వహణ ప్రాజెక్ట్‌లో 21 పోస్టులను వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై లేదా అవుట్ సోర్సింగ్‌లో 6 నెలల పాటు తీసుకోవడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సాంఘీక సంక్షేమ శాఖలో కొత్తగా 330 పోస్టులు మంజూరు. ఇందులో 270 టీచింగ్, 60 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. మైదాన ప్రాంతంలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్పు చేసిన 50 గురుకుల పాఠశాలల్లో 50 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేశారు.

సీడ్ బ్యాంక్....

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విత్తనాలను ముందుగా సేకరించి, శాస్త్రీయ పద్దతిలో నిల్వ చేసి నాణ్యమైన వాటిని రైతాంగానికి సకాలంలో అందించడం కోసం వాణిజ్య బ్యాంకులు/ఎన్‌సీడీసీ / నాబార్డ్ నుంచి 8 శాతం వడ్డీపై 2017-18, 2018-19, 2019-20లకు గాను ఒక్కో ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఆయిల్ ఫెడరేషన్‌కు రూ.150 కోట్లు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ.60 కోట్లు, ఏపీఎస్ఎస్‌డీసీకి రూ.300 కోట్లు చొప్పున రుణం పొందేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విత్తనాలను నిల్వచేయడం కోసం రుణ పరిధిని పెంచాలని గుంటూరు వ్యవసాయ శాఖ సంచాలకులుచేసిన విన్నపం వరకు ఈనిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ఎస్ డీసీఎల్, ఏపీ ఆయిల్ ఫెడరేషన్, ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా ముందుగానే వేరుశనగ విత్తనాలు సేకరించి సబ్సిడీపై రైతులకు అందజేస్తారు.

Similar News