ఏదో వార్తల్లో ఉండాలని అలా...!

Update: 2016-08-24 07:00 GMT

ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి తన వ్యాఖ్యలతో బూమరాంని రేపాడు. అంటే కాకుండా ట్వీట్స్ ద్వారా కూడా ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. అయితే ఈ మధ్య కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య పాకిస్థాన్‌ను పొగిడినందుకు ఆమెపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవాజ్‌ షరీఫ్‌ కుటుంబంలో వివాహ రిసెప్షన్‌కు వెళ్లొచ్చు కాని.. రమ్య పాకిస్థాన్‌ గురించి మాట్లాడితే దేశ ద్రోహం అయిందా అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే ప్రధాని మోడీకి ఒక రూలా.... మిగతావారికి ఒక రూలా అని ఎద్దేవా చేశారు. ఇటీవల భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ పాకిస్థాన్‌ను నరకంతో పోల్చారు. దీనికి కౌంటర్ గా మాజీ ఎంపీ రమ్య పాకిస్థాన్‌ను పొగిడితే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్‌ సమావేశానికి హాజరైన ఆమె పాకిస్థాన్‌ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై ఎటువంటి క్షమాపణ కోరనని ఆమె అన్నారు. మరి మధ్యలో దిగ్విజయ్‌ సింగ్‌ గారికేమైందో. పక్క దేశాన్ని పాకిస్థాన్ ని పొగిడినందుకు రమ్యని వెనకేసుకొస్తున్నారు. మరి ఈయననేమి అనాలి.

Similar News