కూతురిని చూడటానికి వెళ్లడం తప్పా..?

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లండన్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో [more]

Update: 2019-02-22 09:02 GMT

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లండన్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కూతురిని చూడటం కోసం లండన్ వెళ్లిన జగన్ పై విమర్శలు చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కూతురిని చూడటానికి వెళ్లడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. పుల్వామా ఉగ్రదాడిని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని… పాకిస్థాన్ కు మద్దతుగా ఆయన మాట్లాడే స్థాయి చంద్రబాబు చేరుకున్నారని, ఆయన ఉగ్రవాదుల కంటే ప్రమాదకారి అన్నారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలో చేర్చుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలా అయితే హైదరాబాద్ లో యనమల రామకృష్ణుడుకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయా ? పండుల రవీంద్రబాబుకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయా చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు.

Tags:    

Similar News