‘దొంగ సర్వే’పై వైసీపీ ఫిర్యాదు

విజయనగరం జిల్లాలో ప్రేవేటు సర్వే బాగోతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వైసీపీ నేత బోత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు ఈసీ ద్వివేదిని [more]

Update: 2019-01-25 07:31 GMT

విజయనగరం జిల్లాలో ప్రేవేటు సర్వే బాగోతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వైసీపీ నేత బోత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు ఈసీ ద్వివేదిని కలిసి ఈ సర్వేపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు విజయనగరం జిల్లాలో, ఇంతకుముందు గుంటూరు, అనంతపురం జిల్లాలో కొందరు ప్రైవేటు వ్యక్తులు దొంగ సర్వేలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యక్తులు ఓటరు లిస్టు ద్వారా ఇంటింటికి వెళ్లి, ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుని ఓటర్లు ఏ పార్టీ వారు కనుక్కుంటున్నారని పేర్కొన్నారు. ఒకవేళ వైసీపీకి చెందిన సానుభూతిపరులైతే, జగన్ కి ఓటేస్తామని చెబితే వారి వివరాలు పంపించి వారి ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. సర్వే చేసేవాళ్లకు ఓటరు లిస్టుతో ఏం పని అని ప్రశ్నించారు. జాతీయ ఓటరు దినోత్సవం రోజు ఇలాంటివి జరగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వాపోయారు. ఈ సర్వేలను అడ్డుకున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఈ సర్వేలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ఈసీని కోరారు.

Tags:    

Similar News