వైసీపీ బ్లాక్ పేపర్స్.....!!

Update: 2018-12-23 07:53 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలపై తాము బ్లాక్ పేపర్స్ విడుదల చేస్తామని వైసీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆనం విమర్శించారు. గత నాలుగున్నరేళ్లుగా బీజేపీతో అంటకాగి, మోదీకి భజన చేసిన చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి దింపిన చంద్రబాబు శ్వేతపత్రాల్లో ఏంచెబుతారని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలపై తాము కూడా బ్లాక్ పేపర్స్ ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

నల్లారికి అవగాహనలేదు....

ఎన్నికల్లో గెలుపు కోసమే ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని ఎలా చెబుతారన్నారు. విభజన చట్టంలో కేంద్రప్రభుత్వమే నిర్మించాలని ఉంటే, కేవలం ఎన్నికల కోసమే ఉక్కు ఫ్యాక్టరీని ఎలా నిర్మిస్తారన్నారు. రాజధానిని రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మార్చారన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్షం ఏపీలో ఎలా వ్యవహరించిందో అందరికి తెలుసునని, నాలుగేళ్లు నిద్రపోయిన నల్లారి చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడం కోసమే ఏపీలో తిరుగుతున్నారన్నారు.

Similar News