ఆ ఎన్నికకు మేం దూరం

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వల్ల ప్రయోజనం లేదని వైఎస్ [more]

Update: 2021-07-18 03:12 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వల్ల ప్రయోజనం లేదని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. తాము ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని వైఎస్ షర్మిల తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు పగ, ప్రతీకారం కోసమే జరుగుతున్నాయని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

Tags:    

Similar News