బీజేపీతో బాబు సంబంధం కొనసాగుతోందా..?

భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు సంబంధం ఇంకా కొనసాగుతోందా ? లోపాయికారిగా బీజేపీ నేతలతో చంద్రబాబు కలిసే ఉన్నారా ? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2019-04-05 08:44 GMT

భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు సంబంధం ఇంకా కొనసాగుతోందా ? లోపాయికారిగా బీజేపీ నేతలతో చంద్రబాబు కలిసే ఉన్నారా ? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. శుక్రవారం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఇటీవలి పరిణామాలు చూస్తుంటే కేంద్రం చంద్రబాబుకు సహకరిస్తోందని అనుమానం కలుగుతోందన్నారు. ఓ వైపు ఇంత శతృవులుగా చెబుతున్నా మరోవైపు ఎన్నికల తర్వాత బీజేపీతో మళ్లీ చంద్రబాబు కలిసేందుకు వస్తారని అమిత్ షా నిన్న చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ అభ్యర్థి ఇంట్లో ఐటీ రైడ్ జరిగితే సీఎం రమేష్ ఏకంగా ఐటీ అధికారులనే బెదిరించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేఏ పాల్ మా ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, కండువా, ఎన్నికల గుర్తు, అభ్యర్థుల పేర్లు కూడా ఒకేలా ఉన్నాయని తాము అధారాలతో సహా చెప్పినా ఈసీ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఎన్నికల వేళ చంద్రబాబు కేంద్రంపై పోరాడుతున్నట్లు డ్రామా చేస్తున్నారని, అంతర్గతంగా చంద్రబాబుతో బీజేపీకి ఏమైనా అవగాహన ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

Tags:    

Similar News