బాబు ఒంటరిగా ఎప్పుడైనా చేశారా?

Update: 2018-12-22 11:25 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాను ఒంటరిగా ఏ పనీ చేయలేరని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఒంటరిగా పోటే చేసే ధైర్యం కూడా లేదన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి మళ్లీ చూస్తున్నాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కుమారుడికి మంత్రి కొలువు ఇవ్వడం తప్ప రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించలేదన్నారు. ఆర్టీజీఎస్ పేరు చెప్పి తానే ఇస్రో కంటే ముందే తుఫాను ను కనిపెట్టారంటారని సెటైర్ వేశారు. పీవీ సింధూకు బ్యాట్ తిప్పడం నేర్పిందికూడా తానేనని అంటారేమోనని జగన్ చమత్కరించారు. కరెంట్ ఛార్జీలు ఆర్టీజీఎస్ లో కన్పించడం లేదా? అన్నారు. ఇక్కడ తుఫాను వస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో రాజకీయాలు చేయడానికి వెళ్లారన్నారు. చంద్రబాబును సాగనంపితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు జగన్. కాంగ్రెస్ తో పొత్తు అంటూ కొత్త సినిమా తీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఓటు కు నోటు కేసు నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ తో జత కడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో సిగ్గులేకుండా పొత్తు పెట్టుకుంటున్నారన్నారు.

Similar News