బాస్టర్డ్ అని బాబు తిట్టారు

చంద్రబాబు నాయుడు ఎంత దౌర్జన్యంగా వ్యవహరించారో ఇట్టే అర్థమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నిన్న అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్ పై జరిగిన దాడి దృశ్యాలను అసెంబ్లీ [more]

Update: 2019-12-13 04:41 GMT

చంద్రబాబు నాయుడు ఎంత దౌర్జన్యంగా వ్యవహరించారో ఇట్టే అర్థమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నిన్న అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్ పై జరిగిన దాడి దృశ్యాలను అసెంబ్లీ హాలులో ప్రదర్శించారు. చంద్రబాబు గేట్ 2 నుంచి నేరుగా రావాల్సి ఉండగా ఆయన ఊరేగింపుగా వేరే గేటు నుంచి సభలోకి వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. గుంపుగా వస్తుండటంతో ఒక్కొక్కరినీ లోపలికి పంపండం కన్పించిందన్నారు. మార్షల్స్ పట్ల ఎంత అసభ్యకరంగా చంద్రబాబు మాట్లాడారో దీన్ని చూస్తే తెలుస్తుందన్నారు. బాస్టర్డ్ అని తిట్టడం ఘోరమన్నారు. నారా లోకేష్ నాలుగు అడుగులు ముందుకేసి అధికారుల గొంతు పట్టుకున్నారని జగన్ ఆరోపించారు. మార్షల్స్ మీద దౌర్జన్యం చేయడమే కాకుండా తమ మీద దాడిచేశారని టీడీపీ నేతలు చెప్పడమేంటని జగన్ ప్రశ్నించారు. కేవలం సభ్యులు మాత్రమే రావాలని మార్షల్స్ కోరినా గుంపులుగా రావడంతోనే వారు అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రొటోకాల్ ప్రకారమే సభ్యులను లోపలకి పంపేందుకు ప్రయత్నించాని జగన్ చెప్పారు.

Tags:    

Similar News