కళ్లద్దాలు సరిచేసుకుంటే మంచిది

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పేదలకు నాణ్యమైన బియ్యం సరఫరా పై చర్చ జరిగింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో తాను అధికారంలోకి [more]

Update: 2019-12-10 05:01 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పేదలకు నాణ్యమైన బియ్యం సరఫరా పై చర్చ జరిగింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే సన్న బియ్యం అందిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే మంత్రి కొడాలి నాని మాత్రం తాము సన్న బియ్యం ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదని, నాణ్యమైన బియ్యం అందిస్తామని మాత్రమే చెప్పానన్నారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ మంత్రి, రైస్ మిల్లర్ల అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాధరాజును మాట్లాడిస్తే సన్నిబియ్యానికి, స్వర్ణ బియ్యానికి తేడా తెలుస్తుందన్నారు. తాము సన్న బియ్య ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. శ్రీరంగనాధరాజు వివరణ ఇస్తూ ఏపీలో స్వర్ణబియ్యాన్నే ఎక్కువగా తింటారన్నారు. అందుకే సర్ణ బియ్యాన్నే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏపీలో సన్న బియ్యం పండదని కూడా రంగనాధరాజు తెలిపారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ కాకుండా చేయడానికే స్వర్ణ బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. 7029 స్వర్ణ బియ్యాన్ని మన రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలు పండిస్తున్నాయన్నారు. స్వర్ణ వెరైటీనే సన్న బియ్యం అంటారన్నారు.

సన్నబియ్యం కాదు.. స్వర్ణ బియ్యం…..

తాను పాదయాత్ర చేసిన తర్వాత ఎన్నికలకు ముందు విడుదల చేసిన మ్యానిఫేస్టోలో ఏముందో ఒకసారి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. టీడీపీ మ్యానిఫేస్టో గౌరవించదన్నారు. తాము మాత్రం మ్యానిఫేస్టోను గౌరవిస్తామని జగన్ అన్నారు. మ్యానిఫేస్టోలో బియ్యానికి సంబంధించిన అంశం లేదన్నారు. తాను మ్యానిఫేస్టోలో చెప్పని అంశాన్ని అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. కళ్లద్దాలు సరిచేసుకుని తమ మ్యానిఫేస్టోను చదువుకోవచ్చని జగన్ సెటైర్ విసిరారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టామన్నారు. ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తామని జగన్ తెలిపారు. ఇందుకోసం 1400 కోట్లు అధికంగా ఖర్చు పెడుతున్నామన్నారు. సాక్షి పత్రికలోనూ తెలియక సన్న బియ్యం అని తప్పు రాశారన్నారు. తాను పాదయాత్రలో బియ్యంపై ఇచ్చిన వీడియోను శాసనసభలో జగన్ ప్రదర్శించారు.

Tags:    

Similar News