వారిపట్ల జగన్ ఆవేదన.. ఎందుకలా?

వలసకార్మికులు నడిచి వెళుతుండటంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలు వంటి విషయాలపై [more]

Update: 2020-05-14 12:43 GMT

వలసకార్మికులు నడిచి వెళుతుండటంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలు వంటి విషయాలపై జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే వలస కార్మికుల నడచి వెళుతున్న తీరు తనకు ఆవేదన కల్గించిందన్నారు. వారు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? వెళ్లాలనుకుంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది కదా? అని జగన్ అధికారులను ప్రశ్నించారు. అయితే అవగాహన లేకపోవడం వల్లనే వలస కార్మికులు వెళుతున్నారని అధికారులు జగన్ కు వివరించారు. దాదాపు 190 కంటెయిన్ మెంట్ జోన్లు ఏపీలో ఉన్నాయని, 75 కంటెయిన్ మెంట్ జోన్ లలో గత 28 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ ఎగ్జిట్ వ్యూహంపై చర్చలు జరిపారు.

Tags:    

Similar News