అధైర్యపడొద్దు… ఇది శాపం.. పాపం కాదు

కరోనా వైరస్ ఒక శాపంలా ఎవరూ భావంచవద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. దానిని మామూలు ఫ్లూగానే పరిగణించాలని, ఎవరూ అధైర్య పడవద్దని జగన్ పిలుపు నిచ్చారు. [more]

Update: 2020-04-01 11:55 GMT

కరోనా వైరస్ ఒక శాపంలా ఎవరూ భావంచవద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. దానిని మామూలు ఫ్లూగానే పరిగణించాలని, ఎవరూ అధైర్య పడవద్దని జగన్ పిలుపు నిచ్చారు. వైరస్ సోకడాన్ని పాపంగా, తప్పుగా భావించవద్దన్నారు. గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు రాష్ట్రం నుంచి వెయ్యి మందికి పైగానే రాష్ట్రం నుంచి వెళ్లారన్నారు. ఢిల్లీ కి వెళ్లిన వారు స్వచ్ఛందంగా ఆసుపత్రులకు వచ్చి పరీక్షలు చేయించు కోవాలన్నారు. వీరిలో 21 మంది జాడ తెలియడం లేదన్నారు. వీరు గాని, వీరితో కాంటాక్టులో ఉన్న కుటుంబ సభ్యులు గాని 104 నెంబరుకు ఫోన్ చేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని జగన్ కోరారు.

ఇది జ్వరం లాంటిదే….

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 87 కేసులు నమోదయ్యాయన్నారు. దేశ ప్రధానులకు కూడా వైరస్ వచ్చిందని జగన్ గుర్తు చేశారు. ప్రతి ఇంటికి ఏపీలో వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సర్వే చేస్తున్నారని, ఎవరికి గొంతునొప్పి, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్నా వీరికి చెప్పాలన్నారు. వీరికి చెబితే వెంటనే వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తారన్నారు. 81 శాతం ఇళ్లల్లోనే ఉండి వైద్యం చేయించుకుని నయమయిన వారు ఉన్నారని జగన్ తెలిపారు. 14 శాతం మాత్రమే హాస్పిటల్స్ కు తరలిస్తున్నారన్నారు. అందులో నాలుగైదు శాతం ఐసీయూలోకి తీసుకు పోవాల్సిన కేసులన్నారు. అందుకని ఎవరూ దీనిపై భయం పెంచుకోవద్దని, ఆరోగ్యం విషయంలో అన్నీ చెప్పి ప్రభుత్వానికి సహకరించాలని జగన్ కోరారు. ఒక వేళ ఈ వైరస్ ఉంటే మరొకరికి విస్తరించకుండా ఉంటుందన్నారు.

అందరూ సహకరిస్తేనే?

ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రయివేటు మెడికల్ కళాశాల యాజమాన్యం, ప్రయివేటు వైద్యులు, నర్సులు అందరూ ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ను వాయిదా వేశామని, ఈ విషయంలో వారి సహకారాన్ని మరువలేమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పింఛనుదారులకు కూడా వాయిదా వేశామన్నారు. ఇది కోత కాదని, వాయిదా మాత్రమేనని జగన్ తెలిపారు. వ్యవసాయ పనులు చేసుకోవచ్చని, అయితే ఆ పనులు చేసేటప్పుడు భౌతిక దూరాన్ని పాటించాని, పోలీసులు కూడా ఈ విషయంలో ప్రశ్నించిరని జగన్ తెలిపారు. వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమల్లో కూడా పనులు చేసుకోవచ్చాన్నారు. రైతులు, రైతు కూలీలు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వ్యవసాయ పనులకు వెళ్లవచ్చన్నారు.

Tags:    

Similar News