బ్రేకింగ్ : ఏపీలో లాక్ డౌన్ …సరిహద్దులు మూసివేస్తున్నాం

రాష్ట్రంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని, అందులో ఒకరికి చికిత్స తర్వాత నెగిటివ్ వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని ముందు [more]

Update: 2020-03-22 13:55 GMT

రాష్ట్రంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని, అందులో ఒకరికి చికిత్స తర్వాత నెగిటివ్ వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నరారు. ఆశావర్కర్లు, డాక్టర్లు, హెల్త్ సిబ్బంది, గ్రామ వాలంటీర్లకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్లు పూర్తి స్థాయిలో మానటిరంగ్ చేయడంతోనే పరిస్థితి అదుపులో ఉందన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి గ్రామ వాలంటీర్లు సర్వే చేశారని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకలతో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ తెలిపారు.

అన్నీ బంద్…..

ఈ నెల 31వ తేదీ వరకూ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలను మూసివేశామని జగన్ తెలపిపారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలుంటే 104కు కాల్ చేయాలని జగన్ కోరారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ 100 పడకలతో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ చెప్పారు. సినిమా హాళ్లు, మాల్స్, పార్కులు అన్ని మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. టెన్త్ పరీక్షలు యధాథదంగా జరుగుతాయని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. దేశంలో ఇప్పటికే 12 రాష్ట్రాలు తమ బోర్డర్లను మూసివేశాయన్నారు. మనం కూడా ఆ దిశగా అడుగులు వేయక తప్పదన్నారు. అందులో భాగంగానే రాష్ట్రాల సరిహద్దులు మూసివేస్తున్నామన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు సర్వీస్ లన్నీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.ఆటోలు, ట్యాక్సీలు తిరగనివ్వమన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే వాహనాలను వినియోగించాలన్నారు.

వాటికే మినహాయింపు…

నిత్యావసర దుకాణాలు మినహాయించి మిగిలిన అన్ని దుకాణాలను బంద్ చేయాలని జగన్ పిలుపునిచ్చారు. వర్తకులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలన్నీ తక్కువ సిబ్బందితో పనిచేయాలని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారెవరైనా తమకు సహకరించాలని, రిపోర్టు చేయాలని కోరారు. ఈ నెల 31వ తేదీ వరకూ ప్రజలు ఎవరూ ఇల్లు విడిచి బయటకు రావద్దని కోరారు. దయచేసి సహకరించాలని కోరారు. అవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటకు రావాలని, రెండు మీటర్ల దూరం మనిషికి, మనిషికి ఉండేలా చూసుకోవాలని కోరారు. ప్రజలు సహకరించాలని జగన్ కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి 31వ తేదీ తర్వాత సమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ కూడా తక్కువ సమయమే పెడతామన్నారు. బడ్జెట్ ను ఆమోదించుకోవాల్సి ఉన్నందునే సమావేశాలు జరపాలని నిర్ణయించామన్నారు.

Tags:    

Similar News