జగన్ కోరడంతో వారు ఒప్పేసుకున్నారు..కోట్లు ఆదా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తిని సిమెంట్ కంపెనీలు పరిగణనలోకి తీసకున్నాయి. పేదలకు ఇళ్లు, పోలవరం ప్రాజెక్టు వంటి పనులకు పెద్ద యెత్తున సిమెంట్ సరఫరా చేయాల్సి ఉండటంతో [more]

Update: 2020-03-16 07:21 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తిని సిమెంట్ కంపెనీలు పరిగణనలోకి తీసకున్నాయి. పేదలకు ఇళ్లు, పోలవరం ప్రాజెక్టు వంటి పనులకు పెద్ద యెత్తున సిమెంట్ సరఫరా చేయాల్సి ఉండటంతో సీఎం జగన్ రేటును తగ్గించాలని కోరారు. ప్రభుత్వం మీద భారం పడకుండా చూడాలని సిమెంట్ కంపెనీల యాజమాన్యాన్ని కోరారు. ఇందుకు స్పందించిన సిమెంట్ కంపెనీలు 235 రూపాయలకే బస్తా సిిమెంటును సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్ లో బస్తా సిమెంట్ దర 380 రూపాయల వరకూ పలుకుతుంది. సీఎం వినతిని సిమెంట్ కంపెనీల యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవడంతో ప్రభుత్వ ఖజానాకు పెద్దమొత్తంలో ఆదా అవుతుందంటున్నారు.

Tags:    

Similar News