రియాక్షన్ ఉంటుందా?

అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. శాసనమండలిలో బిల్లులు వీగిపోవడంతో అసెంబ్లీలో అధికార పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. శాసనమండలి కోసమే శాసనసభ [more]

Update: 2020-01-23 02:36 GMT

అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. శాసనమండలిలో బిల్లులు వీగిపోవడంతో అసెంబ్లీలో అధికార పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. శాసనమండలి కోసమే శాసనసభ ను ఈరోజుకు ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే మండలిలో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం, మండలి నిరవధిక వాయిదా పడటంతో ఈరోజు అసెంబ్లీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ జరుగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసే అవకాశముందంటున్నారు. తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి మూడు ప్రాంతాల ప్రజలకు చేరవేస్తారంటున్నారు. దీంతో ఈరోజు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు ప్రాముఖ్యత ఏర్పడింది.

Tags:    

Similar News