కష్టాల్లో ఉన్నా ఆదుకుంటుంది అందుకే

పేద విద్యార్థులకు చదువు దూరం కాకూడదనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. జగనన్న వసతి దీవెన పథకం కింద జగన్ లబ్దిదారుల [more]

Update: 2021-04-28 06:07 GMT

పేద విద్యార్థులకు చదువు దూరం కాకూడదనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. జగనన్న వసతి దీవెన పథకం కింద జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఒక్కొక్క లబ్దిదారుడికి ఏడాదికి ఇరవై వేలు ఈ పథకం కింద చెల్లించనున్నారు. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే నగదును జమ చేస్తున్నామని చెప్పారు. 10.89 వేల మందికి లబ్ది చేకూరేలా ఈ పథకం కింద జమ చేస్తున్నామని జగన్ తెలిపారు. వసత, దీవెన పథకం కింద ఇప్పటివరకూ 2,270 కోట్ల రూపాయల కింద చెల్లంచామని జగన్ తెలిపారు. కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయినా పథకాన్ని ఆపలేదన్నారు. ఈ పథకం వల్ల డ్రాప్ అవుట్స్ చాలా తగ్గాయని జగన్ తెలిపారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఈపథకం కింద నగదును చెల్లిస్తున్నామని చెప్పారు పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు పదిహేను వేలు, ఇంజినీరింగ్ విద్యార్థులకు 20 వేలు ఆర్థికసాయం ఇస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News