మీరు మంచి చేస్తే నా మీద ఎందుకు ఏడుస్తారు..?

చంద్రబాబు ఐదేళ్ల పదవీకాలంలో ప్రజలకు, రాష్ట్రానికి మంచి చేస్తే ఆయన యెల్లో మీడియాలో దానిపై చర్చ పెట్టకుండా తన మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో ప్రజలు ఆలోచించాలని [more]

Update: 2019-03-20 08:58 GMT

చంద్రబాబు ఐదేళ్ల పదవీకాలంలో ప్రజలకు, రాష్ట్రానికి మంచి చేస్తే ఆయన యెల్లో మీడియాలో దానిపై చర్చ పెట్టకుండా తన మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో ప్రజలు ఆలోచించాలని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం నెల్లూరు జిల్లా కావలి ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏకంగా మేనిఫెస్టోనే మాయం చేసేశారని ఆరోపించారు. చేసిన పనులు చెప్పుకోలేక ఇతరులపై చంద్రబాబు నేపాలు నెడుతున్నారని ఆరోపించారు. హరికృష్ణ మృతదేహం సాక్షిగా టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్ పై పోరాడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకక ఎవరో బెదిరిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

ఒక్క అవకాశం ఇవ్వండి…

ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన రూ.3 వేలకు ప్రజలు మోసపోవద్దని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తామన్నారు. ఎన్నికలు రాకుంటే, తాను చెప్పి ఉండకపోతే చంద్రబాబు రూ.2 వేల పింఛన్ పెంచేవారేనా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలన్నీ తెలుసుకున్నానని, ప్రత్యక్షంగా చూశానన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రవేశపెట్టనున్న నవరత్నాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తన తండ్రి పరిపాలన అందరూ చూశారని, తనకు ఒక్క అవకాశం ఇస్తే అంత కంటే మంచి పాలన తీసుకువస్తానని పేర్కొన్నారు.

Tags:    

Similar News