తొలి జీఓ జారీ చేసిన జగన్ సర్కార్..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి జీఓను జారీ చేసింది. వైఎస్సార్ పింఛన్ పథకం పేరుతో ప్రస్తుతం ఉన్న పింఛన్లను పెంచుతూ జీఓ జారీ చేశారు. వృద్ధులు, [more]

Update: 2019-05-31 07:22 GMT

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి జీఓను జారీ చేసింది. వైఎస్సార్ పింఛన్ పథకం పేరుతో ప్రస్తుతం ఉన్న పింఛన్లను పెంచుతూ జీఓ జారీ చేశారు. వృద్ధులు, వితంతుల పింఛన్లను రూ.2,250కి, వికలాంగుల పింఛన్ రూ.3 వేలకు, కిడ్నీ వ్యాధిగ్రస్థుల పింఛన్ రూ.10 వేలకు పంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్య పింఛన్ వయస్సును సైతం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదించారు. పెంచిన పింఛన్లు జులై 1 నుంచి అమలులోకి అందనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నిన్ననే ప్రమాణస్వీకారం చేయగానే మొదటి సంతకం చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News