జగన్ మళ్లీ సిట్

విశాఖ భూకుంభకోణంపై జగన్ ప్రభుత్వం మళ్లీ సిట్ వేసింది. విశాఖలో పెద్దయెత్తున భూకుంభకోణం జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ [more]

Update: 2019-10-18 03:33 GMT

విశాఖ భూకుంభకోణంపై జగన్ ప్రభుత్వం మళ్లీ సిట్ వేసింది. విశాఖలో పెద్దయెత్తున భూకుంభకోణం జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను నియమించింది. సిట్ నివేదికను సమర్పించినా దానిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం బయటపెట్టలేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో రిటైర్ట్ సీనియర్ ఐఎస్ అధికారి విజయకుమార్ తో పాటు పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి వైవీ అనూరాధ, రిటైర్డ్ జస్టిస్ భాస్కరరావులను నియమించింది. ఈ సిట్ పదవీకాలం మూడు నెలలుగా నిర్ణయించారు. సిట్ ఏర్పాటుతో మళ్లీ విశాఖలో జరిగిన భూకుంభకోణంలో ఎవరి పేర్లు బయటకు వస్తాయన్న చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News