జగన్ శ్రీకారం చుట్టారు…!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ‘అన్న పిలుపు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తటస్థులుగా ఉన్న 75 వేల మందికి ఆయన [more]

Update: 2019-01-31 10:51 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ‘అన్న పిలుపు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తటస్థులుగా ఉన్న 75 వేల మందికి ఆయన లేఖలు రాశారు. రాష్ట్ర ప్రగతికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. ఇందులో మొదటి విడతగా ఇవాళ సుమారు 200 మందితో వైసీపీ కార్యాలయంలో సమావేశమై వారి నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ కొత్త పథకాలు అమలు చేస్తే ప్రజలు మోసపోరన్నారు.

ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడూ….

గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అధికారంలోకి వస్తే రూ.2కి కిలో బియ్యం ఇస్తానని చెప్పారని తెలిపారు. అయితే, ఎన్టీఆర్ ప్రకటనతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమై చంద్రబాబు లాగానే ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ.1.90 పైసలకే కిలో బియ్యం ఇచ్చారని గుర్తుచేశారు. అయితే, ప్రజలు మాత్రం కాంగ్రెస్ కి కాకుండా ఎన్టీఆర్ ను నమ్మి గెలిపించారన్నారు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా కాంగ్రెస్ లానే అవుతుందన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తే ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.

Tags:    

Similar News