క్షీణించిన మరో వైసీపీ ఎంపీ ఆరోగ్యం

Update: 2018-04-09 03:54 GMT

ఢిల్లీ ఏపీ భవన్ లో ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తున్న మరో వైసీపీ ఎంపీ ఆరోగ్యం క్షీణించింది. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గత నాలుగు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైవీ సుబ్బారెడ్డి బీపీ సమస్యతో బాధపడుతున్నారని, ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు చెప్పారు. అయితే వైవీ మాత్రం తాను దీక్ష ను కొనసాగిస్తానని చెబుతున్నారు. ఈ నెల 6వ తేదీన వైసీపీకి చెందిన ఐదుగురు పార్లమెంటు సభ్యులు ఆమరణదీక్షకు దిగగా, ఇందులో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం కూడా క్షీణించిందని, వెంటనే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు చెబుతున్నా వైవీ వినడం లేదు.

Similar News