తిరిగి టీడీపీలో చేరికకు …?

వైసీపీ నేత పాలపర్తి డేవిడ్ రాజు తిరిగి టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమయమిస్తే తిరిగి తాను పార్టీలో చేరతానని డేవిడ్ రాజు చెప్పారు. ఏపీలో పరిస్థితులు ఏమాత్రం [more]

Update: 2021-01-18 01:45 GMT

వైసీపీ నేత పాలపర్తి డేవిడ్ రాజు తిరిగి టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమయమిస్తే తిరిగి తాను పార్టీలో చేరతానని డేవిడ్ రాజు చెప్పారు. ఏపీలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని అన్నారు. డేవిడ్ రాజు 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తర్వాత తిరిగి వైసీపీ లో చేరారు. అయితే తాజాగా ఆయన మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబు నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని డేవిడ్ రాజు తెలిపారు. ఆయన పార్టీ నేత దామచర్ల జనార్థన్ ను కలిశారు. తన వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని దిద్దుకునేందుకే తిరిగి టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యానని చెప్పుకొచ్చారు. తనతోపాటు తన కుమారుడు కూడా టీడీపీలో చేరతారని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News