న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు

చట్ట సభల్లో చర్చలు, నిర్ణయాలపైన న్యాయస్థానాల జోక్యం ఉండకూడదని స్పీకర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్ణయాలు, చర్చలు చట్టం, [more]

Update: 2020-08-08 07:24 GMT

చట్ట సభల్లో చర్చలు, నిర్ణయాలపైన న్యాయస్థానాల జోక్యం ఉండకూడదని స్పీకర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్ణయాలు, చర్చలు చట్టం, రాజ్యాంగ విరుద్ధమైతే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని యనమల రామకృష్ణుడు తెలిపారు. మూడు రాజధాని బిల్లులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీలో పెండింగ్ లో ఉన్నాయని యనమల చెప్పారు. ఈ విషయాన్ని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపిన విషయాన్ని యనమల గుర్తు చేశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను రెండోసారి ప్రభుత్వం ఎలా తీసుకువచ్చందని యనమల ప్రశ్నించారు. స్పీకర్ ఈ విషయాలు తెలుసుకుంటే మంచిదని యనమల తెలిపారు.

Tags:    

Similar News