సంచలనం సృష్టిస్తున్న యడ్యురప్ప డైరీ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యురప్ప డైరీలో రాసిన వివరాలు సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన రాసిన డైరీగా చెబుతూ కారవాన్ అనే ఓ మ్యాగజైన్ సంచలన [more]

Update: 2019-03-23 06:10 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యురప్ప డైరీలో రాసిన వివరాలు సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన రాసిన డైరీగా చెబుతూ కారవాన్ అనే ఓ మ్యాగజైన్ సంచలన కథనం ప్రచురించింది. యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతలకు రూ.1,800 కోట్లు ఇచ్చినట్లుగా ఈ డైరీలో యడ్యురప్ప స్వంత చేతిరాతతో ఉన్నట్లుగా ఈ కథనంలో రాశారు. అంతేకాదు, 2009లో రాసినట్లుగా చెబుతున్న ఈ డైరీలో ఏయే నేతకు ఎంతెంత సొమ్ము అందజేశారో కూడా ప్రచురించారు. బీజేపీ సెంట్రల్ కమిటీకి వెయ్యి కోట్లు, అరుణ్ జైట్లీకి 150 కోట్లు, నితిన్ గడ్కరికి 150 కోట్లు, రాజ్ నాథ్ సింగ్ కు 100 కోట్లు, అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు 50 కోట్లు ఇచ్చినట్లుగా యడ్యూరప్ప డైరీలో రాసుకున్నట్లుగా మ్యాగజైన్ ప్రచురించింది. ఈ కథనం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కథనం ఆధారంగా కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ బీజేపీ చిక్కుల్లో పడింది. ఈ డైరీ ఐటీ శాఖ సోదాల్లో దొరికిందని, ఈ వివరాలు రాసిన తర్వాత యడ్యూరప్ప సంతకాలు కూడా చేశారని కారవాన్ కథనంలో పేర్కొంది.

Tags:    

Similar News