కౌంటింగ్ తర్వాత సినిమా ఏందో చూడండి

ఓడిపోయే సీటును తనకు కేటాయించారన్న వాదనలో అర్థం లేదని వర్ల రామయ్య అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయడం తన ధర్మంగా భావిస్తానని చెప్పారు. దళితులకు ప్రాధాన్యత [more]

Update: 2020-03-11 06:51 GMT

ఓడిపోయే సీటును తనకు కేటాయించారన్న వాదనలో అర్థం లేదని వర్ల రామయ్య అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయడం తన ధర్మంగా భావిస్తానని చెప్పారు. దళితులకు ప్రాధాన్యత ఇచ్చేది టీడీపీ మాత్రమేనని చెప్పారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను పూర్తి చేస్తామన్నారు. తాను ఒక వారియర్ ని అని అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. చంద్రబాబు అన్నా, టీడీపీ అన్నా తనకు ఇష్టమని వర్ల రామయ్య చెప్పారు. తనకు ఆత్మ ప్రభోదం మేరకు ఓట్లు వేయాలని వర్ల రామయ్య కోరారు. అంబేద్కర్ ఐడియాలజీని పెద్దల సభలో విన్పించాలంటే తనకే ఓటు వేయాలని వర్ల రామయ్య కోరారు. చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని చెప్పడం సరికాదన్నారు. ఏం జరగబోతుందో సినిమా తర్వాత చూడండి అని అన్నారు.

Tags:    

Similar News